Home  »  Bollywood News  »  హాలీవుడ్ రేంజ్ కాన్సెప్ట్‌తో వస్తున్న అక్షయ్ కుమార్: 'సముక్' సినిమా షూటింగ్ కీలక అప్‌డేట్!

Updated : Aug 12, 2026

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రయోగాలకు ఎప్పుడూ ముందుంటారు. విభిన్నమైన కథాంశాలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరించే ఆయన, ఈసారి భారతీయ సినీ చరిత్రలోనే అరుదుగా వచ్చే ఏలియన్ థ్రిల్లర్ జానర్‌లో ‘సముక్’ అనే విభిన్నమైన సినిమాతో అలరించేందుకు సిద్ధమయ్యారు.

ఈ భారీ ప్రాజెక్ట్‌కి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు 23 నుంచి లండన్‌లో ప్రారంభం కానుంది. ఈ సినిమా చిత్రీకరణలో అత్యధిక భాగం అంటే దాదాపు 90 శాతం లండన్ లొకేషన్లలోనే జరపాలని మేకర్స్ ప్లాన్ చేశారు. ఎక్కడా విరామం ఇవ్వకుండా ఒకే నిరంతర షెడ్యూల్‌లో లండన్ చిత్రీకరణను పూర్తి చేయడానికి చిత్ర బృందం ఏర్పాట్లు చేస్తోంది.

లండన్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత మిగిలిన కొన్ని కీలక సన్నివేశాలను ముంబైలో తెరకెక్కించనున్నారు. విదేశీ లొకేషన్లు, అంతర్జాతీయ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ (VFX) అలాగే ప్రత్యేకం రూపకల్పన చేసిన ఏలియన్ డిజైన్స్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

ఈ చిత్రానికి కనిష్క్ వర్మ దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ నిర్మాణ సంస్థతో కలిసి విపుల్ అమృత్‌లాల్ షా నిర్మిస్తున్నారు. గతంలో అక్షయ్ కుమార్, విపుల్ షా కాంబినేషన్‌లో వచ్చిన ‘ఆంఖే’, ‘వక్త్’, ‘నమస్తే లండన్’, ‘సింగ్ ఈజ్ కింగ్’ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించాయి. ఇప్పుడు మళ్లీ వీరిద్దరి కాంబోలో సినిమా వస్తుండటంతో అంచనాలు భారీగా పెరిగాయి.

భారతీయ చిత్ర పరిశ్రమలో సైన్స్ ఫిక్షన్ ఏలియన్ జానర్ సినిమాలు చాలా అరుదుగా రూపుదిద్దుకుంటాయి. ఈ నేపథ్యంలో అక్షయ్ కుమార్ చేస్తున్న ఈ కొత్త ప్రయోగంపై సినీ ప్రియుల్లో మరియు ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. అంతర్జాతీయ సాంకేతిక నిపుణుల భాగస్వామ్యంతో ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

సోషల్ మీడియాలో కూడా ఈ ప్రాజెక్ట్ అప్‌డేట్ రాగానే అక్షయ్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒక సరికొత్త హాలీవుడ్ స్థాయి సర్వైవల్ థ్రిల్లర్ అనుభవాన్ని ఇండియన్ స్క్రీన్‌పై చూడబోతున్నామని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

అన్ని కార్యక్రమాలను వేగంగా పూర్తి చేసి ‘సముక్’ చిత్రాన్ని 2027లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్న అక్షయ్ కుమార్ కెరీర్‌లో ఈ సినిమా ఒక ప్రత్యేకమైన మైలురాయిగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 

Akshay Kumar, Samuk Movie, Vipul Amrutlal Shah, Kanishk Varma 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.